పాలకొండ: నాగవంశపు వీధిలోని శ్రీశ్రీశ్రీ పురటాల పోలమాంబ అమ్మవారి సన్నిధిలో శ్రావణమాస ఐదు శుక్రవారాల్లో పవిత్ర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 14 (మొదటి శుక్రవారం), 21 (రెండవ శుక్రవారం), 28 (మూడవ శుక్రవారం), సెప్టెంబరు 4 (నాలుగవ శుక్రవారం) మరియు సెప్టెంబరు 11 (ఐదవ శుక్రవారం) తేదీల్లో అమ్మవారి సన్నిధిలో మహిళల చేత లలితా సహస్ర పూర్వకంగా విశేష కుంకుమార్చనలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వేమకోటి రవిబాబు, బాలగణపతి భజన బృందం మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.