పాలకొండ వెబ్ న్యూస్ | 14 ఆగస్టు, 2026స్థానిక మున్సిపాలిటీ ఆఫీసులో SC కమిషన్ బోర్డు మెంబర్ రావాడ సీతారాం మాట్లాడుతూ పాలకొండ మున్సిపాలిటీలో సబ్ ప్లాన్ నిధులు 50 లక్షల గ్రాంట్ నుండి ఒక్కో వీధికి 10 లక్షల చొప్పున రెల్లి వీధి, కస్పవీధి, నాగవంశం వీధి దగ్గర అంబేద్కర్ నగర్ కు కేటాయించామని చెప్పారు. అలాగే SUDA నుండి కూడా కస్పవీధికి 35 లక్షల పనుల కోసం అధికారులకు మున్సిపాలిటీ వాళ్ళు లెటర్ పెట్టారని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల్లో SC వారికి ఎంత కేటాయించినా ఆ నిధులను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. G.O. NO 52 ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినటువంటి గ్రాంట్ లో SC 15 శాతం, ST 6 శాతం కలిపి 21 శాతం కేటాయింపులు లెక్క కట్టి eprocurement చేయాలని స్పష్టం చేశారు. ఉదాహరణకి VMRDA పరిధిలో చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ ఆదేశాలను తన క్రింది వారు పెడచెవిన పెట్టడం, నిర్లక్ష్యం చేయడం కారణంగా కమిషనర్ కోర్టులో ప్రాసిక్యూట్ అయ్యారని తెలిపారు. అందుకే అందరూ పై అధికారులు చెప్పిన ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారి Ch.రాధాకృష్ణమూర్తి, డోల వెంకన్న SI, ఇంచార్జి ఎంపిడిఓ S.A.రాముడు, కమిషనర్ P.V.నూకరాజు, ఇంచార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు, స్థానిక మాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
0 Comments