పాలకొండ వెబ్ న్యూస్
(కళాభారతి న్యూస్):పితృదేవతల పట్ల గౌరవం, దైవం పట్ల భక్తి భావంతో పాలకొండకు చెందిన ఒక దాత కుటుంబం
శ్రీ కోట దుర్గమ్మ వారి దేవస్థానానికి తమ దాతృత్వాన్ని చాటుకుంది. పట్టణానికి చెందిన
దివంగత కందుల క్రిష్ణ మూర్తి,
సుశీల దంపతుల జ్ఞాపకార్థం, వారి కుమారుడు
కందుల బాల యోగేశ్వర రావు మరియు కోడలు
మంజుల దంపతులు ఉదారంగా
రూ. 25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) విరాళంగా అందించారు.ఈ విరాళాన్ని కందుల దంపతులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO)
వి.వి. సూర్యనారాయణ కి మర్యాదపూర్వకంగా అందజేశారు. కీర్తిశేషులైన వారి తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలని, దేవస్థానం అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో ఈ మొత్తాన్ని అందజేసినట్లు కందుల బాల యోగేశ్వర రావు తెలిపారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.వి. సూర్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివంగత తల్లిదండ్రుల పట్ల దంపతులు చూపిన గౌరవాన్ని అభినందించారు. కోట దుర్గమ్మ అమ్మవారి సేవకు, ఆలయ కార్యక్రమాలకు ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దాత కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో దుంపల చిన్ని, శేఖరు పాల్గొన్నారు. News by : B SS Prasad
0 Comments