డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ డిమాండ్

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఏఎంజి కన్వర్షన్ హాల్ వద్ద వైస్సార్సీపీ అధినేత శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి 
ఆదేశాల మేరకు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని  కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షశిబిరాన్ని  పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు ప్రారంభించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు విక్రాంత్ గారు మాట్లాడుతూDSC-2025 స్కాం పై సీబీఐ విచారణ చేయాలని,DSC లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలని,
ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే చెల్లించాలని,
హామీ మేరకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం విద్యార్థి,యువజన విభాగం నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments