పాలకొండ సురేష్ హైస్కూల్లో భగవద్గీత పుస్తకాల పంపిణీ

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 27-07-2026:​పాలకొండ సురేష్ హైస్కూల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ‘గీత అర్చన’ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత పుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు చంటి భాస్కర్ నాయుడు, పాలకొండ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి ఎన్.వి.రమణ పాల్గొని విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.వి.రమణ మాట్లాడుతూ, భగవద్గీత ఒక అద్భుతమైన జ్ఞాననిధి అని, దీనిని ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు. మానవుడు తన మేధస్సు అంతటినీ ధారపోసినా గీతా జ్ఞానంలోని ఒక చిన్న అంశాన్ని మాత్రమే తెలుసుకోగలడని అరవింద యోగేంద్రుడు చెప్పారని గుర్తుచేశారు. అలాగే మన శరీరాభివృద్ధికి తల్లిపాలు ఎంత ఉపయోగపడతాయో, బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా తోడ్పడుతుందని వినోబా భావే విశ్లేషించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

Post a Comment

0 Comments