పాలకొండ వెబ్ న్యూస్, జూలై 29, 2026:పాలకొండ సత్యసాయి శివం మందిరంలో గురుపూర్ణిమ సందర్భముగా గురుపూజ మరియు ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి ఎన్ వి రమణ ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. గురుపూర్ణిమ అనగా వ్యాస పౌర్ణమి అని, అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసభగవానుని పుట్టిన దినమని తెలిపారు. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించే సమర్థుడే గురువు అని వివరించారు. వ్యాసభగవానుని వంశ పరంపర బ్రహ్మ, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసభగవానుడు మరియు ఆయన కుమారుడు శుక మహర్షి అని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఈ అష్టాదశ పురాణాల సారాంశాన్ని "హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్" అని చెప్పారని, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, ఎవరికీ అపకారం చేయకూడదనే సారాంశాన్ని వివరించారు. అనంతరం సత్యసాయి సూక్తులను తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఉత్తరావిలి ప్రభాకర్ రావు, భక్తులు పాల్గొన్నారు..
0 Comments