పాలకొండ వెబ్ న్యూస్ బ్లాగ్ ప్రారంభం: నైతిక విలువలతో వార్తలు అందించాలి: జొన్నలగడ్డ కామేశ్వరరావు

 పాలకొండ వెబ్ న్యూస్ : 30.10.2025 పాలకొండ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు జొన్నలగడ్డ కామేశ్వరరావు, పాలకొండకు చెందిన బాసూరు శివశంకర ప్రసాద్ ప్రారంభించిన 'పాలకొండ వెబ్ న్యూస్' బ్లాగును ఈరోజు పాలకొండ  శ్రీ కోట దుర్గమ్మ దేవస్థానం సన్నిధిలో లాంచనంగా ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణ, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జొన్నలగడ్డ కామేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మీడియా వారు విధులు తోపాటు నైతిక విలువలు తప్పక పాటించాలని, ప్రతి వార్త నిజమైన, నిర్ధారిత సమాచారంపై ఆధారపడాలని ఉద్ఘాటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఈ వెబ్ న్యూస్ ద్వారా పాలకొండ ప్రజలకు, ఇతర ప్రాంతాల వారికి వార్తలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ, వార్తలతో పాటు ప్రజలకు ఉపయోగపడే   పబ్లిక్ ఇన్ఫర్మేషన్, విద్యా, దేవాలయ వార్తలను ఈ బ్లాగులో ప్రచురించడం అభినందనీయమన్నారు. ఎడిటర్ బి. శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ, 1999లో ఈనాడులో కంట్రిబ్యూటర్ గా పాత్రికేయ వృత్తి మొదలుపెట్టి 26 సంవత్సరాల అనుభవంతో సమాజాభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ కోటదుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి వి. వి. సూర్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ మరియు  ప్రెస్ క్లబ్ సభ్యులు, పాఠకులకు ఎడిటర్ కృతజ్ఞతలు తెలిపారు. News by BSS Prasad

Post a Comment

0 Comments