పాలకొండ వెబ్ న్యూస్: 01.10.2025
పాలకొండ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో ప్రయాణికుడు మారం కేశవరావు (మెoతిపేట, రాజాం) మరచిపోయిన 50 వేల రూపాయల నాణేల రెండు మూటలను ఆన్‌డ్యూటీ కంట్రోలర్ గుర్తించి భద్రపరిచారు. అనంతరం డిపో సెక్యూరిటీ వారి ఆధ్వర్యంలో, పాలకొండ డిపో మేనేజర్ శ్రీ పట్నాన వెంకటేశ్వరరావు సమక్షంలో, సెక్యూరిటీ ఇన్చార్జి హెడ్‌గార్డు ఐ. ఉమామహేశ్వరరావు, గార్డు టి. రాము సదరు యజమానికి తిరిగి అప్పగించారు. ఈ నిజాయితీకి కృతజ్ఞతలు తెలుపుతూ మారం కేశవరావు ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు. News by BSS Prasad

0 Comments