పాలకొండలో దివ్యజీవన సత్సంగ సమావేశం

పాలకొండ వెబ్ న్యూస్: అక్టోబర్ 12: ఆదివారం నాగవంశపు వీధిలోని రామ మందిరంలో దివ్యజీవన సత్సంగ సమావేశం జరిగింది. ఈ సభను జల్లు నారాయణరావు మరియు తుమ్మగుంట శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించగా, కంచుమోజు రామ్మోహన్ రావు, జడ్డు జగ్గారావు ఆశీస్సులు కార్యక్రమాన్ని నిండుగా ఆభూషించాయి. సభను ఎన్వీ రమణ అధ్యక్షత వహించారు.సభలో ప్రసంగించిన ఎన్వీ రమణ కలియుగంలో మానవునికి సర్వసంపదలు ఉన్నప్పటికీ శాంతి, ఆనందం లేవని, ఇవి భగవంతుని దగ్గరే దొరకుతాయని పేర్కొన్నారు. అందుకే భగవంతుని ధ్యానించడం, పూజించడం అత్యంత అవసరం అని చెప్పారు. భక్తులలో నాలుగు రకాలు ఉంటాయని, జ్ఞానులు అందరికన్నా గొప్పవారన్నారు. అందువల్ల మనం జ్ఞానులుగా తీర్చిదిద్దుకోవాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక సత్సంగాల్లో పాల్గొనడం ముఖ్యం అని భావన తెలియజేశారు. పాలకొండ సమావేశం అనంతరం డి. యోగేశ్వరరావు, కోటబొమ్మాలి మండలం ఊడికిపాడు నుండి ప్రత్యేక వక్తలు గా  కే. కరుణాకర్ మాస్టర్, ఏం. మోహన్ దాస్, ఎస్. మల్లేశ్వర రావు, రామస్వామి, కర్రీ గోపన్న, జడ్డు జగ్గా రావు, సనపల కారుణాకర రావ్, శంకర రావు లు  ప్రసంగించారు. తరువాత అనేక భక్తులు తమ అనుభవాలు, ఆలోచనలను పంచుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత నారాయణ సేవ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భక్తులు  హాజరై ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందారు. News by: BSS Prasad

Post a Comment

0 Comments