కులం"కంపు"కొడుతోంది భారతావని..

కులం"కంపు"కొడుతోంది భారతావని..
అన్నీ మారుతున్నాయ్ 
ప్రపంచం పెను సంచలానాలతో 
విజ్ఞాన విహంగామై విహారిస్తుంది 
"ఎఐ " అంటూ సాంకేతికతో...!!!

కానీ,నాదేశం లో "కులం " కాలి "బుటూ"గా అహంకారమై రివ్వున ఎగిరి 
సుప్రీంఅత్యున్నత న్యాయ పిఠాన్ని  తాకుతుంది...!!!
దానికేదోపేరుంది.. "సనాతనమని"

అదేదో పిచ్చి వాడి చేతిలో బూటు కాదు.. కులంతో బలిసిన 
సమాజంలో ఒక వికృత పార్శం.! 
నాగరికుడు సిగ్గు తో తలదించుకొనే ఒక సామజిక జాడ్యమ్.. వెరసి వికృత రూపం!

అది ఎవ్వరినీ వదలదు..!
నువ్వెంత చదివినా!! నీ హోదా ఎంతైనా.!!!
నువ్వు "గావాయ్" జడ్జి వైనా..!
"డీజీ " పోలీస్ "పూరన్" వైనా...!
చివరకు "మూర్ము"  "దేశాదక్షు రాలైనా"...క్రొత్త పార్లమెంట్
ప్రారంభానికి ఆహ్వాన పత్రికనే
చింపేస్తుంది..!నీ స్థాయి చాలదాంటూ.. వాడెవడో
కాషాయ బిక్ష సాధువు కంటే
నువ్వు ఆధమం.. అంటూ
"కులం" వెక్కిరిస్తూనే వుంది...!!

గుడి, బడి, భోజన పంక్తి,  వీధి, వాసం, సభలో కుర్చీ, ఆఫీస్, అంగడి,... అన్నీ..నిన్ను ఇంకా
కులం కార్డు తోనే తొక్కేస్తుంది..!

అయినా నువ్వు మారవు..!
నువ్వు మారతావని ఆశించి,
రాజ్యాంగలో "అస్పృశ్యత నేరం"
అని రాసి పెట్టిన అంబేద్కరుడు
సాక్షిగా.. నువ్వెప్పటికీ మారవు..

ఎందుకంటే నీ నరాల్లో రక్తంలో
"కులం కంపు" కేన్సర్ మారి...
ఈ సమాజానికి మానని "రాచపుండు" గా మారింది..!!
ప్రపంచంలో ఎక్కడాలేని ఈరోగం
 ఈ భారతావని కే సాంతం...!!!

అందుకే మారవోయిసనాతనడా!
కులంలేని మతంలేని సమానత్వ
నాగరిక సమాజాన్ని నిర్మించు..!
"కులం కంపు" నుండి... మానవవీయా సుగందానీవై..!
ప్రణవించు.. కనీసం "మనిషి"గా    నైనా బ్రతుకు...!!!
        రచన: భరత్ భూషణ్ రాజ్ నూతులపాటి
      ( సామాజిక ఉద్యమ నేత, అభ్యుదయ కవి,                          రచయిత.. ఉత్తరాంధ్ర)

Post a Comment

0 Comments