జర్నలిస్టులకు ఘన సత్కారం

పాలకొండ వెబ్ న్యూస్ : స్థానిక షిరిడీసాయి కళ్యాణ మండపంలో మంగళవారం పాలకొండ ప్రెస్ క్లబ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో  జర్నలిస్టులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యలను వెలికితీస్తూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  
​ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ జోన్నలగడ్డ కామేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, జిల్లా స్థాయి యూనియన్ ఉపాధ్యక్షుడు వల్లూరు సత్యనారాయణనాయుడు, సూర్య రిపోర్టర్ వెలమల రమణ, ఆక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు, కథనం ఎడిటర్ యామాల ఈశ్వరరావులను  శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.  
​సమాజంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని, జర్నలిస్టుల సంక్షేమానికి, ఐక్యతకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.  

Post a Comment

0 Comments