స్వచ్ఛ ఆంధ్ర జిల్లా అవార్డుల్లో పాలకొండ నగర పంచాయతీకి ప్రథమ స్థానం

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 01 అక్టోబరు 2026​స్వచ్ఛ ఆంధ్ర జిల్లా అవార్డ్స్ 2026లో పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీ, సాలూరు మున్సిపాలిటీ మరియు పాలకొండ నగర పంచాయతీలలో ఉత్తమ మున్సిపల్ అవార్డును పాలకొండ నగర పంచాయతీ దక్కించుకుంది. పారిశుధ్య నిర్వహణలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లభించడం పట్ల కమిషనర్ పీవీ నూకరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, వ్యాపారుల సమిష్టి సహకారంతోనే ఈ అవార్డు లభించిందని చెబుతూ ప్రజలకు, వ్యాపారస్తులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

​ఈ అవార్డులలో భాగంగా స్వచ్ఛ వారియర్ కేటగిరీలో పాలకొండ నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పడాల జనకు బెస్ట్ వర్కర్ అవార్డు లభించింది. స్వచ్ఛ దేవాలయాల కేటగిరీలో కోట దుర్గ దేవస్థానమునకు, స్వచ్ఛ హాస్పిటల్ కేటగిరీలో యు పి హెచ్ సి నీలమ్మ కాలనీకి అవార్డులు దక్కాయి. స్వచ్ఛ గవర్నమెంట్ కార్యాలయాల విభాగంలో సబ్ కలెక్టర్ కార్యాలయమునకు, స్వచ్ఛ ఇండస్ట్రీస్ అవార్డు మోబి క్వాలిటీ ఫైబర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాలకొండ వారికి, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ అవార్డు రాజరాజేశ్వరి ఎస్ఎల్ఎఫ్ వారికి లభించింది.

Post a Comment

0 Comments