స్వచ్ఛతా నీ వెక్కడ? అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాద్ రావు.

పాలకొండ వెబ్ న్యూస్: వెలగవాడ(పాలకొండ): ప్రతి నెల మొదటి శనివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి కార్యాలయం ఈ కార్యక్రమంలో భాగం కావాల్సి ఉంది. అయితే వెలగవాడ సచివాలయ పరిధిలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. వెలగవాడ గ్రామం నుండి పి.ఆర్. రాజుపేట వైపు వెళ్లే రహదారిపై చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. స్థానికులు చెత్తను రోడ్డు పక్కన వేయడం వల్ల పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి రెండు వైపులా కూడా బహిరంగ మలవిసర్జన జరుగుతుండటంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈ సమస్యపై గ్రామ ప్రజలు పలుమార్లు సచివాలయ సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం సార్థకమవ్వాలంటే గ్రామస్థాయిలోనూ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments