పాలకొండ వెబ్ న్యూస్ / కళాభారతి న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ మాధవరావు ఆదేశాల మేరకు పాలకొండ డి.ఎస్.పి. రాంబాబు ఆధ్వర్యంలో నేడు పాలకొండలో మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది.
నేడు ఉదయం 8 గంటలకు పాలకొండ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ రక్తదాన శిబిరాన్ని డి.ఎస్.పి. రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేక ఎందరో అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలందరూ ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఇతర ప్రాంతాలకు తరలించకుండా, తమ పాలకొండ ఏరియా ఆసుపత్రిలోనే నిల్వ ఉంచుతామని డి.ఎస్.పి. రాంబాబు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్లా కొండలరావు మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎందరి జీవితాల్లోనో ఆనందాన్ని నింపడానికి దోహదపడతాయని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరం నిర్వహణకు అవసరమైన సామగ్రిని పల్లా కొండలరావు తన వంతు సహాయంగా అందించారు. "రండి! రక్తదానం చేద్దాం, ప్రాణాలు కాపాడుదాం" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.
News by : BSS Prasad

1 Comments
నిరంతరం ప్రజల రక్షణకోసం, మండుటెండలో నిరంతరం తన శరీరంలో స్వేద దానం....
ReplyDeleteనేడు
రోగులు / బాధితుల ప్రాణాలు కాపాడటం కోసం రక్తదానం.....
హ్యాట్సాఫ్ Police.... 🫡 🫡