చెరువు గర్భంలో అక్రమ నిర్మాణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీఎం డిమాండ్.

పాలకొండ వెబ్ న్యూస్ 📰 నవంబర్ 2:
పాలకొండ నగర పంచాయతీ పరిధిలో పీతల బంధ సహా ఇతర చెరువుల ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు జరిపించి, శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్) డిమాండ్ చేసింది. నగర పంచాయతీ పరిధిలోని నాగవంశం వీధిలో సర్వే నెంబరు 22 ఏలో 93 సెంట్లు ఉన్న పీతల బంధ చెరువు ఆక్రమణకు గురైందంటూ వార్తలు రావడంతో, ఆదివారం సీపీఎం ప్రతినిధి బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రమణారావు మాట్లాడుతూ... నాగవంశం వీధిలోని పీతల బంధతో పాటు, పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వడమ, ఎన్.కె. రాజపురం వంటి ప్రాంతాల్లో ఉన్న చెరువులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments