ఈ నెల 21' లోగా కోర్టుకు హాజరవుతా: జగన్

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరవుతానని మంగళవారం నివేదించారు.యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు హాజరయ్యేందుకు ఆయన సమ్మతి తెలిపారు. వాస్తవానికి ఈ నెల 14న కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, అంతకుముందు దాఖలు చేసిన హాజరు మినహాయింపు మెమోను ఆయన మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు జగన్ తరఫున సీబీఐ కోర్టులో తాజాగా మెమో దాఖలైంది.

Post a Comment

0 Comments