పోలీసుల నిజాయితీ: పోగొట్టుకున్న రూ.3 వేల నగదు అప్పగింత పణుకుపర్థ గ్రామానికి చెందిన బాధితురాలికి సబ్ డివిజన్ శక్తి టీమ్ సాయం

🗞️ పాలకొండ వెబ్ న్యూస్:పాలకొండ సబ్ డివిజన్‌కు చెందిన శక్తి టీమ్ సభ్యులు తమ నిజాయితీని చాటుకున్నారు. దుర్గ గుడి ఆవరణలో పోగొట్టుకున్న రూ. 3,000 నగదును విచారణ జరిపి, దాని అసలు యజమానికి అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం (09.11.2025) పాలకొండలో జరిగింది.వివరాల్లోకి వెళితే, పాలకొండ దుర్గ గుడి ఆవరణలో ₹3,000 నగదు లభ్యమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలకొండ సబ్ డివిజన్ శక్తి టీమ్ వెంటనే రంగంలోకి దిగి, ఆ నగదు ఎవరిదో తెలుసుకునేందుకు ఎంక్వయిరీ నిర్వహించింది./పోలీసుల విచారణలో, ఆ నగదు వణుకుపర్థ గ్రామానికి చెందిన లావాటి దుర్గమ్మ అనే మహిళ పోగొట్టుకున్నట్లుగా నిర్ధారించారు. దీంతో, శక్తి టీమ్ ఇంచార్జ్ ఏఎస్ఐ ఝాన్సీ భాయ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రకృతాంబ, కానిస్టేబుల్స్ రాము, గణపతి దుర్గమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, పోగొట్టుకున్న రూ. 3,000 నగదును ఆమెకు అప్పగించారు. పోలీసులు చూపిన నిజాయితీకి లావాటి దుర్గమ్మ కృతజ్ఞతలు తెలియజేసింది. శక్తి టీమ్ సభ్యుల చొరవను, నిజాయితీని స్థానికులు మరియు పలువురు ప్రముఖులు అభినందించారు.


Post a Comment

0 Comments