పాలకొండను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళంలో కలపాలి: మంత్రి అచ్చం నాయుడికి వినతి

పాలకొండ, నవంబర్ 4 (పాలకొండ వెబ్ న్యూస్): పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ 'పాలకొండ జిల్లా సాధన సమితి' ప్రతినిధులు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడుకు విజ్ఞప్తి చేశారు. నేడు నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ పాలకొండ ఇంఛార్జి పడాల భూదేవి సమక్షంలో సమితి ప్రతినిధులు మంత్రిని కలిశారు. పాలన సౌలభ్యం, శ్రీకాకుళం పెద్ద జిల్లాగా ఉన్న దృష్ట్యా పాలకొండను శ్రీకాకుళంలో కలపడానికి అవకాశం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గాన్ని శ్రీకాకుళంలో విలీనం చేయాలని ప్రతినిధులు కోరగా, అవకాశం ఉంటే ప్రయత్నిస్తానని మంత్రి తెలిపారు. సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, ట్రెజరర్ సబ్బ నానాజీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments