శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం నేడు: కలెక్టర్

కళాభారతి న్యూస్ : శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్చ్, ప్రవాస భారతీయుల సాధికారత శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అధ్యక్షత వహించనున్నారు. వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవల పురోగతి, నిధుల వినియోగంపై అధికారులు సమీక్షించనున్నారు. సంబంధిత శాఖాధికారులు నివేదికలతో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

Post a Comment

0 Comments