పాలకొండలో భగవద్గీత ఔన్నత్యం: ఋషి యోగా కేంద్రంలో ఘనంగా గీతాజయంతి వేడుకలు

పాలకొండ వెబ్ న్యూస్ :భగవద్గీత పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఋషి యోగా కేంద్రంలో సోమవారం వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యోగా సాధకులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్లోక పఠనం, ధార్మిక ప్రవచనం
యోగా గురూజీ ధనుంజయ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కేంద్రంలో యోగ సాధకులు భగవద్గీతలోని శ్లోకాలను భక్తితో పఠించారు. అనంతరం యోగ గురూజీ ధనుంజయ్  భగవద్గీత యొక్క ఔన్నత్యాన్ని, ప్రతి ఒక్కరి జీవితంలో దాని ప్రాముఖ్యతను గురించి వివరించారు.
ఈ సందర్భంగా, బొడ్డు రామ్మోహన్  మాట్లాడుతూ, భగవద్గీత సకల మానవాళికి ధర్మాన్ని, జీవన మార్గాన్ని ఉధ్భోదించే మహత్తర గ్రంథం అని తెలిపారు. ప్రతి ఒక్కరూ గీతా సారాన్ని అర్థం చేసుకుని, ఆచరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డొకర శ్రీను, కందుల శ్రీను, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments