వీరఘట్టం నీలానగరంలో అయ్యప్ప అంబులెం పడి పూజ: టీడీపీ, జనసేన నాయకుల సందడి

వీరఘట్టం మండలం నీలానగరం గ్రామంలో పాలవలస ఉమా గురుస్వామి వారి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి వారి అంబులెం పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు శ్రీ కర్నెన అప్పల నాయుడు స్వామి మరియు శ్రీమతి కర్నెన యోగితమ్మ స్వామి పాల్గొన్నారు. వారితో పాటు పాలకొండ మండల టీడీపీ నాయకులు జాడ శ్రీధర్ స్వామి కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
జనసేన పార్టీ నాయకులు కూడా ఈ పడి పూజకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలకొండ మండలం జనసేన నాయకులు మిడితాన ప్రసాద్ స్వామి, పాలకొండ టౌన్ జనసేన నాయకులు కొండదాడి రాజేష్ స్వామి, మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరఘట్టం మండల టీడీపీ నాయకులు ఉదయాన ఉదయ్ భాస్కర్ స్వామి, శివ్వాల రాంబాబు స్వామి, ప్రముఖ పాప్ సింగర్ లావేటి ఉమామహేశ్వర్ స్వామి, పాలవలస లీలాప్రసాద్ స్వామి, సత్యనారాయణ స్వామి తదితరులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా పాలవలస ఉమా గురుస్వామి అందరినీ ఆశీర్వదించారు.

Post a Comment

0 Comments