పాలకొండ వెబ్ న్యూస్ : నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఎం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం నవోదయ నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు డి. రమణారావు మాట్లాడారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు పూర్తయినా పాలకొండలో రోడ్డు విస్తరణ, మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్య, ఇంటింటి కొలాయిలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్లక్ష్యం చేశారని వారు ఆరోపించారు. ముఖ్యంగా గారమ్మ, జగనన్న, బుట్టి మఠం, గాయత్రి నగర్ కాలనీలలో మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని అన్నారు. తోటపల్లి కాలువ ఆధునీకరణ, జంపర్‌కోట రిజర్వాయర్ నిర్మాణం, పాలిటెక్నికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలకొండ సభలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.నెల రోజుల్లో అభివృద్ధికి కార్యచరణ చేపట్టకపోతే, సీపీఎం పార్టీ కులమతాలకు అతీతంగా ప్రజలను కలుపుకొని ఉద్యమాలకు సిద్ధమవుతుందని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ. భానుచందర్, కె. రాము, డి. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments