పాలకొండ సత్యసాయి సేవాసమితిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనం

పాలకొండ, నవంబర్ 19, 2025 (బుధవారం):
పాలకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక మహిళా దినోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి పూజలు, సాయి మాత పూజలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి పాలకొండకు చెందిన శ్రీమతి తెన్నేటి పార్వతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సమితి పలు సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా 9 మంది మహిళలకు అమృత కలశాలను అందించారు. అంతేకాకుండా, 18 మంది గర్భిణులకు సాంప్రదాయబద్ధంగా శీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో మహిళలు సహా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యసాయి బాబా వారి ఆశీస్సులు అందుకున్నారు

Post a Comment

0 Comments