పాలకొండ ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బౌరోతు శంకరరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆయన ఉత్తమ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, విదేశీ పర్యటనకు ఎంపిక చేసింది.ఈ నెల 27వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి శంకరరావు మాస్టారు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్‌లోని ప్రముఖ విద్యావేత్తలను కలిసి, అక్కడి పాఠశాలల్లో అమలు అవుతున్న విద్యావిధానం, అధునాతన బోధన పద్ధతులపై లోతుగా అధ్యయనం చేయనున్నారు.
డిసెంబర్ నెలలో ఇదే బృందం ఢిల్లీలో కూడా పర్యటించి, అక్కడ అమలు అవుతున్న విద్యా విధానాన్ని, తీరుతెన్నులను పరిశీలించనుంది. నిస్వార్థ సేవలు, బోధనా నైపుణ్యంతో శంకరరావు మాస్టారు పొందిన ఈ అరుదైన అవకాశం పట్ల ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. వారి కృషికి ఇది లభించిన తగిన గుర్తింపుగా పలువురు కొనియాడారు.
0 Comments