పాలకొండలో ఘనంగా డా. అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

పాలకొండ, డిసెంబర్ 6 (పాలకొండ వెబ్ న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని పాలకొండ పట్టణంలోని యాలం సెంటర్‌లో దళిత బహుజన సంఘాలు సంయుక్తంగా  ఘనంగా నిర్వహించాయి. పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆలిండియా దళిత రైట్స్ ఫోరం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఒక దిక్సూచి వంటివారని కొనియాడారు. బహుజనుల హక్కుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుడి మరణాన్ని ప్రజల జీవన పోరాటంగా ఆయన వర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నేటి యువతరం అమలు దిశగా అడుగులు వేయాలని, బ్రష్టు రాజకీయాలు పక్కన పెట్టి యువత ముందుకు వచ్చి ప్రజలలో చైతన్యం రగిలించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్మారక కార్యక్రమంలో దళిత నాయకులు కొంచాడ జాన్, గురుబిల్లి రవికుమార్, యమ్మల సతీష్, బత్తిన జీవరత్నం, తెర్లంగి ఉపేంద్ర, గుజ్జల రామారావు, భోగి విశ్వేశ్వరరావు, నూకాల కరుణాకర్ రావు, మండలక్ష్మణరావుతో పాటు దళిత యువసేన నాయకులు పొట్నూరు రమేష్, జామి అనిల్, అప్పన్న మరియు వివిధ దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బాబాసాహెబ్‌కు నివాళులర్పించారు.

Post a Comment

0 Comments