కళాభారతి’ జనవరి–2026 సంచిక ఆవిష్కరణపత్రికా సంపాదకుల కృషి అభినందనీయం: సీనియర్ జర్నలిస్ట్ మురళీమోహన్ రావు

పాలకొండ: సాహిత్యం, సామాజిక అంశాల సమన్వయంగా వెలువడుతున్న ‘కళాభారతి’ మాసపత్రిక జనవరి–2026 సంచికను సీనియర్ జర్నలిస్ట్ కొండదాడి మురళీమోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో ఒక పత్రికను నిరంతరాయంగా నిర్వహించడం ఎంతో కష్టసాధ్యమైన పని అని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ ‘కళాభారతి’ పత్రికను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న సంపాదకులు శివ శంకర్ ప్రసాద్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

మురళీమోహన్ రావు మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల ఆవేదనలను ఎప్పటికప్పుడు పాఠకులకు చేరవేయడంలో పత్రిక నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. ‘కళాభారతి’ పత్రిక భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, పాఠకాదరణ పొందుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

అదేవిధంగా ‘పాలకొండ వెబ్ న్యూస్’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన వార్తలను వేగంగా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. గత నాలుగు నెలల వ్యవధిలో ఈ వెబ్ న్యూస్‌ను 53,000 మంది వీక్షించడం పత్రిక విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

0 Comments