మావూరొచ్చె విమానమూ!
సాగులు మరచిన భోగాపురము..
శివారు పంటల సమాధి మీదా..
వాలిందమ్మా! విమానమూ!
తాటి తోపుల తల కొట్టేసి..
మొక్క జొన్నల మెడ నరికేసి,
నడక దారులను మసి చేసేసి,
వచ్చిందమ్మా విమానమూ..
సునామీ గాలికి సమానమూ!
ఊళ్లు ఖాళీ.. భూములు ఖాళీ
రైతు ఇక్కడే రోజు కూలీ!
చెమటతో తడిసిన పాగా మీదా..
దిగినాదమ్మా! విమానమూ- అది..
ఇనుప డేగతో సమానమూ!
ఆరిపోయిన భోగి మంటలు,
సంకు రాతిరికి రాని కాకులు!
పశువులు లేని కనుమ గుండెపై..
కూతేసింది విమానమూ,
అది తీతువపిట్టతో సమానమూ!
సెంట్లు పూసుకుని ఎదురెళ్ళారు,
సెంటు భూమినీ ఇవ్వనివాళ్లు,
నాగలి ఎరగని నాయకులంతా
ఎక్కిన సక్కని విమానమూ-
ఆది.. వచ్చీ, పోయే దుకాణమూ!
వచ్చిందమ్మా! విమానమూ!!
- నల్లి ధర్మారావు
Cell: 76609 67313
0 Comments