తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పడాల భూదేవి ఆదేశాల మేరకు స్వర్గీయ కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలు పాలకొండలో ఘనంగా జరిగాయి. టౌన్ టీడీపీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద కాపు వీధి సెంటర్లో ఉన్న ఎర్రం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మజ్జి జయశంకర్ మాట్లాడుతూ ఎర్రం నాయుడు జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు బొమ్మలాట స్వర్ణ రాణి, లాస గణపతిరావు, కర్నెన గణేష్, దుమ్ముద దుర్గారావు, గుమ్మడి ఉమామహేశ్వరరావు, పామోటి పెంటమనాయుడు, సిరిపురపు రాంబాబు, దుప్పాడ నారాయణరావు, మహంతి దుర్గారావు, పామోటు వీరయ్య, దుప్పాడ దుర్గారావు, గుమ్మడి శంకర్రావు, గుమ్మడి దుర్గారావు, శాసపు చిన్నయ్య, కాగీతపల్లి జగ్గులు, ఉదయాన కవిత్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
news by: BSS Prasad
0 Comments