గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటళ్లు: కార్మికుల జీవనం అగమ్యగోచరం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 21.03.2026:​అమెరికా, ఇజ్రాయిల్ దేశాల యుద్ధ కాంక్ష కారణంగా ఇరాన్ పై జరుగుతున్న దాడులు భారత ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువైన వంట గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పాలకొండ డివిజన్ కేంద్రంలోని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు మూతపడుతున్నాయి. దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, మండల కార్యదర్శి కాదా రాము ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పాలకొండలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి చిరు వ్యాపారులపై సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

​చిన్న వ్యాపారాలను పరిగణలోకి తీసుకుని వారికి ప్రత్యామ్నాయంగా గ్యాస్ సరఫరా చేయాలని ఆటో యూనియన్ ప్రతినిధులు బి రాజు, జె శ్రీను, ఎస్ వేణు, కె సూరి కోరారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో డొమెస్టిక్ గ్యాస్ వినియోగంపై నిబంధనలు సడలించి చిల్లర వర్తకులకు వెసులుబాటు కల్పించాలని, రేషన్ పద్ధతిలో గ్యాస్ అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక కుటుంబాల జీవితాలు మరింత ఛిద్రమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments