పాలకొండ వెబ్ న్యూస్ : పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు మాదకద్రవ్యాల నియంత్రణే ధ్యేయంగా పోలీసులు శనివారం ఉదయం పాలకొండలోని కస్పా వీధిలో పోలీసులు ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ చేపట్టారు. స్థానిక డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో ఈ మెగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ ఏ.ప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పెనుముప్పుగా మారిన మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. యువత చెడు మార్గాల వైపు మళ్లకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో ఎస్ఐ డి.వెంకన్న మరియు పోలీసు సిబ్బంది పాల్గొని పరిశీలించారు..
0 Comments