ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరదా చదువుల ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం

​పాలకొండ వెబ్ న్యూస్, 15 మార్చి 2026: ఏడు మండలాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో ఎంపికైన విజేతలకు సరదా చదువుల సంస్థ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ కన్వీనర్ ఎన్ వి రమణ మరియు కో కన్వీనర్ ఎం సంపత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని, సరదా చదువుల ఇంగ్లీష్ వీడియోలు విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారి ప్రావీణ్యాన్ని పెంచుతున్నాయని సంపత్ కుమార్ కృషిని అభినందించారు. రేగిడి ఆముదాలవలస ఎంఈఓ ఎం వి ప్రసాద్ రావు మాట్లాడుతూ ఈ వీడియోలు ఎఫ్ ఎల్ ఎన్ కృత్యాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వీరఘట్టం ఎంఈఓ 2 ఆర్ ఆనంద్ రావు, మరో అతిథి చిన్నాల అచ్యుతరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు.

​ఈ సందర్భంగా దాతలు తెన్నేటి పార్వతమ్మ, లోచర్ల హరిబాబు, చంద్రశేఖర్, గేదెలు శ్రీరాములును సన్మానించారు. ఐదు మరియు ఎనిమిదో తరగతిలో మొదటి పది స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఐదో తరగతి నుండి ఎస్ లోహిత్, ఎం హిమశ్రీ, టి హర్షవర్ధన్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ఎనిమిదో తరగతి నుండి కె గీతిక, ధూప ఢిల్లీశ్వరి, పి జయశంకర్ విజేతలుగా నిలిచారు. విజేతలకు వరుసగా 2000, 1500, 1000 రూపాయల నగదుతో పాటు కన్సోలేషన్ బహుమతులు పంపిణీ చేశారు. నిర్వాహకులు ఎన్ వి రమణ మరియు మరడాన సంపత్ కుమార్, శారదామని దంపతులను సభికులు ఘనంగా సన్మానించారు. బౌరోతు శంకర్రావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హేమిని కుమార్, పద్మజ, ధనుంజయ నాయుడు, వాసుదేవరావు, రామలక్ష్మి, జయప్రదం, రాధిక లక్ష్మి, లీలా ప్రసాద్, రాంబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments