భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి వినతి

​పాలకొండ వెబ్ న్యూస్, 7 మార్చి 2026:​ భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం దేశీయ రైతాంగానికి గొడ్డలిపెట్టుగా మారుతుందని, దీనిని నిరసిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసేందుకు ఏఐకేఎస్, ఎస్కేఎం పిలుపులో భాగంగా వెలగవాడ పంచాయతీ రుద్రపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ, సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు సంఘం నాయకులు ఖండాపు ప్రసాదరావు మాట్లాడుతూ అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పాల ఉత్పత్తులపై సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖండాపు ప్రకాష్ రావు, శ్రీనివాసరావు, గార వెంకట్రావు, సతీషు, పాండ్రంకి భవాని, చీర తబిట్ నాయుడు, రాజారావు, వావిలపల్లి ప్రసాదరావు, పి శంకర్రావు, ఎన్ ప్రసాద్, ఎం శంకర్రావు, పళ్ళ సూర్యనారాయణ, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

​News by: BSS Prasad

Post a Comment

0 Comments