పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్: 605 కేసులు పరిష్కారం

పాలకొండ వెబ్ న్యూస్, 12 సెప్టెంబర్ 2026:

​పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్ జడ్జి చందక హరిప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 30 కేసులు రాజీ మార్గం ద్వారా, 575 కేసులు అడ్మిషన్ ద్వారా పరిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా చందక హరిప్రియ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ పడటం ద్వారా కక్షిదారులకు సమయం మరియూ డబ్బు ఆదా అవుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సీనియర్ మరియూ జూనియర్ న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments