పాలకొండ వెబ్ న్యూస్
పాలకొండ శాఖా గ్రంథాలయంలో శనివారం సాయంత్రం ఇంటర్మీడియట్ 1987 బ్యాచ్ విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా రాజ్యాంగం నుంచి చట్టాలు, నవలలు, ధ్యాన గ్రంథాలు, వ్యాస గ్రంథాలు, దేశ నాయకుల జీవిత చరిత్రలు, కవితా సంకలనాలు, రచనలు వంటి పుస్తకాలను లైబ్రేరియన్ బబ్బురు గణేష్ బాబు కు పూర్వ విద్యార్థులు అందజేశారు. పుస్తకాలతో పాటు ప్రత్యేక స్టాండ్‌ను కూడా విరాళంగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండపాక రామ్ గోపాల్, టి. ఉమామహేశ్వరరావు, మల్లికార్జున పట్నాయక్, పైల శశిధర్, బలివాడ శ్రీధర్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments