పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాల ప్రత్యక్ష ప్రసారం


పాలకొండ వెబ్ న్యూస్ .20.09.2025
పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనుంది. ఈ మహోత్సవాల ప్రత్యక్ష ప్రసారం శ్రీ కోటదుర్గ సిటీ కేబుల్ 10వ నెంబర్ ఛానెల్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
ప్రతిరోజు సాయంకాలం జరిగే శ్రీ చక్ర మహామేరు పూజ, పంచామృతాభిషేకం, అష్టదిగ్బంధనం పూజా కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆలయం నుండి నేరుగా ప్రసారం చేయనున్నారు.
అలాగే, ఈ కార్యక్రమాలను భక్తులు యూట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.




Post a Comment

0 Comments