తెరచాటుకు పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ వారు

పాలకొండ, సెప్టెంబర్ 4:

పాలకొండ శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రతి ఏడాది మాదిరిగానే ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించబడనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 8, 2025 సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి తెర వేయబడుతుంది. అనంతరం సెప్టెంబర్ 22, 2025 సోమవారం ఉదయం 8 గంటలకు నిజ రూప దర్శనంతో అమ్మవారు భక్తులకు మహాదర్శనమిస్తారు.

ఆలయ అధికారులు తెలిపిన ప్రకారం, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించి అమ్మవారిని అలంకార శోభతో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments