అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి వెల్లడించారు.
0 Comments