పాలకొండ వెబ్ న్యూస్
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పాలకొండ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశానికి వారం రోజుల ముందుగానే అధికారిక ఆహ్వానం పంపినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ని పోలీసులతో కలిసి గేటు ముందు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రజా ప్రతినిధ్య చట్టం ద్వారా లభించిన రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛ (ఆర్టికల్ 19)ను కించపరచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ G.A.D ఉత్తర్వులను పట్టించుకోకుండా అధికారుల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నేతలు మండిపడ్డారు.
ఈ పరిణామాలపై నిరసనగా, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి పిరియా విజయ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ శ్రీ సిరిపురపు జగన్మోహన రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సభను వాకౌట్ చేశారు. జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు.
సభలో పాల్గొన్న సభ్యులు ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ, తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0 Comments