పాలకొండ రెవెన్యూ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం

పాలకొండ వెబ్ న్యూస్: 21 సెప్టెంబర్ 2025.. పాలకొండ రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికలకు కలెక్టరేట్ ఏవో జి. శ్రీరామ్ మూర్తి, పార్వతీపురం డిటి ప్రసాద్ రావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా, బలిజిపేట తాసిల్దార్ పి. బాలమురళీకృష్ణ పరిశీలకుడిగా ఉన్నారు. ఎన్జీవో డివిజన్ గౌరవ అధ్యక్షులు లిల్లి పుష్పనాదం పర్యవేక్షణలో ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం వివరాలు:
 * అధ్యక్షులు: ఎం. సావిత్రి (సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో)
 * కార్యదర్శి: పి. సన్యాసిరావు (పాలకొండ తాసిల్దార్ కార్యాలయం సిఎస్డిటి)
 * అసోసియేట్ అధ్యక్షులు:
   * ఎం.ఎన్. ప్రసాద్ (పాలకొండ హెచ్‌డిటి)
   * సురేష్ కుమార్ (కురుపాం హెచ్‌డిటి)
   * ఎన్. శేఖరం (జి.ఎల్.పురం హెచ్‌డిటి)
 * ఉపాధ్యక్షులు: కే. శ్రీవిద్య (సీతంపేట ఆర్.ఎస్.డి.టి)
 * జాయింట్ సెక్రటరీ:
   * ఆర్. మనోహర్ (జి.ఎం.వలస జూనియర్ సహాయకులు)
   * పి. మణిప్రభ (భామిని ఆర్.ఐ)
   * మీనాక్షి (పాలకొండ ఆఫీస్ సబార్డినేటెడ్)
 * కోశాధికారి: వి. గణేష్ బాబు (సీతంపేట)
 * కార్యవర్గ సభ్యులు: ఎన్. ఆశ (పాలకొండ ఎలక్షన్ జూనియర్ సహాయకులు)
అదేవిధంగా, వీరఘట్టం తాసిల్దార్ సాయి కామేశ్వరరావును జిల్లా రెవెన్యూ కార్యదర్శిగా నియమించాలని డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ తరపున ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Post a Comment

0 Comments