పాలకొండ వెబ్ న్యూస్: తేదీ.23.09.2025న, పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ అసెంబ్లీ లో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలసి, పాలకొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించమని విన్నవించారు.
ప్రధాన విన్నపాలు:
పాలకొండ ప్రధాన రహదారి అభివృద్ధి: కళింగపట్నం – పార్వతీపురం రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి కోసం రూ.16.50 కోట్ల మంజూరు.
గిరిజనులకు న్యాయం: 2000 సంవత్సరం జీ.ఓ. నెం.3 పునరుద్ధరణ, స్థానిక గిరిజనులకు అర్హత నిర్ధారణ.
రైతులకు మద్దతు: గిరిజన రైతుల వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగు కోసం యాంత్రిక పరికరాల పంపిణీ.
జలాశయం నిర్మాణం: జంపరకోట జలాశయం పూర్తి కోసం రూ.30.00 కోట్ల మంజూరు.
డంపింగ్ యార్డు సమస్య: పాలకొండ నగర పంచాయతీకి డంపింగ్ యార్డు మంజూరు.
తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని, అవసరమైన నిధులను మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
0 Comments