మహా చండీగ అలంకారంలో శ్రీ కోటదుర్గమ్మవారు


పాలకొండ వెబ్ న్యూస్
      పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారు మహా చండీగ అలంకారంలో నేడు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మహాదివ్య రూపాన్ని దర్శించుకోవాలని ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి చండీగ రూపాన్ని చూసిన భక్తులు పులకరించి పోయారు.
      ఓపక్క భక్తులు బిందె దీపాలు సమర్పించి తమ కోరికల సాధనకు పూజలు చేశారు. మరోవైపు భక్తులు సంబరాలు జరుపుకుంటూ "జై కోటదుర్గమ్మ" నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.
అమ్మవారి ప్రాధాన్యత :
చండీగ రూపంలో దర్శనమిచ్చే శ్రీ కోట దుర్గ అమ్మవారు దుష్టశక్తులను సంహరించి భక్తులకు శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని నమ్మి దీపారాధన, బిందె దీపాలు సమర్పించే వారికి శుభకార్యాలు సాఫల్యం చేకూరుతాయని విశ్వాసం ఉంది.
కోట దుర్గ అమ్మవారికి భక్తులు ఘటాలు సమర్పిస్తూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అమ్మవారి ఆలయం ప్రాంగణం భక్తుల నినాదాలతో మార్మోగిపోతోంది. సంప్రదాయబద్ధంగా అలంకరించిన ఘటాలను భక్తులు మేళ తాళాలతో అమ్మవారి రూపంలో గల అలంకరింపబడిన వేషగాళ్ల నృత్యాలతో మంగళ వాయిద్యాల మధ్య ఆలయానికి తీసుకువెళ్తూ భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
    అమ్మవారికి ఘటాలు సమర్పించడం ద్వారా ఇంటింటా శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
News by: BSS Prasad


Post a Comment

0 Comments