త్రిశక్తి స్వరూపిణి సహిత అష్టదశ శక్తిపీఠముల మట్టి విగ్రహములు ప్రతిష్ట

 మన పాలకొండ వార్తలు (వెబ్ న్యూస్ ) పాలకొండ, సెప్టెంబర్ 21 : 

పాలకొండ నక్కలపేటలోని శ్రీ షిరిడీ సాయి సమేత సకల దేవతాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుండి అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయని ఆలయ కమిటీ ప్రకటించింది.

విజయదశమి (దసరా) శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అలంకరణలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ మహోత్సవంలో “త్రిశక్తి స్వరూపిణి సహిత అష్టదశ శక్తిపీఠముల మట్టి విగ్రహములు ప్రతిష్ట మహోత్సవం” విశేష ఆకర్షణగా నిర్వహించనున్నారు.


కార్యక్రమాల విజయవంతం కోసం అధ్యక్షులు పల్లా కొండల రావు, నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పర్రి శరత్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

👉 స్థానికులు, భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు..

Post a Comment

0 Comments