ఆర్ & బి రహదారులు మంజూరు చేయాలి..ఎమ్మెల్యే జయకృష్ణ

పాలకొండ వెబ్ న్యూస్: 23.09.2025 :మన్యం జిల్లా సీతంపేట మండలంలో గల రెండు ప్రధాన రహదారులను ఆర్ & బి రహదారులుగా మంజూరు చేయాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసెంబ్లీలో కోరారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన ఆర్ & బి శాఖ మంత్రిని కోరుతూ, గిరిజనులు పండించిన పంటలను సంతలకు సులభంగా చేరేలా రహదారులు అత్యవసరమని వివరించారు.

సీతంపేట మండలంలోని కోడిస జంక్షన్ నుంచి కడగండి వరకు అలాగే కోడిస నుంచి వజ్జాయిగూడ వరకు ఆర్ & బి రహదారులను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రహదారులు ఏర్పడితే గిరిజన రైతులకు పంట రవాణా సులభమవుతుందని ఎమ్మెల్యే జయకృష్ణ అసెంబ్లీలో స్పష్టం చేశారు.


Post a Comment

0 Comments