వీరఘట్టం : పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటం అద్భుతమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించినట్లు మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు.
బుధవారం తాడేపల్లిలో జగన్‌తో భేటీ అయిన కళావతి స్థానిక సమస్యలు, రైతుల ఇబ్బందులు, తల్లికి వందనం, పింఛన్లు, ఆటో-క్యాబ్ డ్రైవర్ల సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలపై పోరాటానికి అండగా ఉంటామని, 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి కష్టాలను తీర్చుతామని జగన్ భరోసా ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
0 Comments