పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ నుండి ఓణి, జగనన్న కాలనీ మార్గంలో మరియు బత్తులవాని చెరువు వద్ద అనుమతులు లేకుండా డంపింగ్ యార్డుగా మార్చారని వైస్ ఎంపీపీ కనపాక సూర్య ప్రకాశ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలకొండ–ఓణి ప్రధాన రహదారిపై చెత్త వేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దుర్వాసనతో లుంబూరు, గరుగుబిల్లి, ఓణి, గుడివాడ, దెప్పిగూడ, కొత్తవూరు, పులిగుమ్మి, సీతంపేట గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. చెత్త వద్ద కుక్కలు ఎక్కువగా చేరి, విద్యార్థులు, వృద్ధులు రాకపోకలకు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జగనన్న కాలనీ ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంతవరకు పంచాయతీ కమిషనర్‌ను పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోయిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో లుంబూరు సర్పంచ్ తిర్లంగి ఉపేంద్ర కుమార్, రైతులు నెల్లి నాగభూషణ రావు, జనార్ధన, టి.సింహాచలం, పాలకొండ రైతులు పాల్గొన్నారు.
-
0 Comments