మహిషాసుర మర్ధినిగా దర్శనమిచ్చిన లలితా దేవి

పాలకొండ వెబ్ న్యూస్: 

పాలకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కొలువై ఉన్న లలితా దేవి అమ్మవారు ఈరోజు భక్తులకు మహిషాసుర మర్ధిని దేవిగా దర్శనమిచ్చారు. శోభాయ మానమైన అలంకరణలో దేవి అమ్మవారి రూపాన్ని చూసేందుకు ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.మహిషాసుర మర్ధిని అవతారంలో దుర్గాదేవి శక్తి వైభవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేక పూజలు, అర్చనలు ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.భక్తులు కుంకుమ పూజలు చేసి, ప్రత్యేక ప్రార్థనలు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నినాదాలతో మారుమ్రోగింది.

Post a Comment

0 Comments