పాలకొండ పురటాల పోలమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు – ఆపరేషన్ సింధూర్‌కు సెల్యూట్

పాలకొండ వెబ్ న్యూస్ .. 01.10.2025, పాలకొండ నగవంశం వీధి జంక్షన్ మెయిన్ రోడ్ లో గల పురటాల పోలమాంబ గ్రామ దేవత ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరిగాయి అమ్మవారు మహిషాసుర మర్థినిగా దర్శనమిచ్చారు. ఆలయ పురోహితులు వేమకోటి రవిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అశేష భక్తజనం దర్శించుకున్నారు.చాలా పురాతనమైనటువంటి ఈ ఆలయంలో మ్రొక్కులు  తీర్చుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరు తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం అలాగే అమ్మగారు ముక్తిని ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటోత్సవంను   పురటాల పోలమాంబ అమ్మవారి భక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారికి ఘటాలు సమర్పించారు. బండ్ల వేషాలు, పులి వేషాలు కోలాటం చూపర్లను ఆకట్టుకున్నాయి భారత సైన్యం విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ కు సెల్యూట్ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని పెట్టారు. ఇది కూడా చూపరులను లను ఆకట్టుకుంది. ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని ప్రతిబింబించినట్టుగా ఉందని చూపరులు ప్రశంసించారు.”News by : BSS Prasad





Post a Comment

0 Comments