గొట్టమంగళాపురంలో విశ్రాంతి భవనం షెడ్ ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్ : 26-09-2025  పాలకొండ
మండలంలోని గొట్టమంగళాపురం గ్రామంలో విశ్రాంతి భవనం షెడ్ శుక్రవారం ప్రారంభమైంది. భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబడింది. గ్రామ సర్పంచ్ కరణం బాబ్జమాస్టారు చేతుల మీదుగా ప్రారంభించారు.
      సుమారు 77 మంది దాతల సహకారంతో విశ్రాంతి భవనం షెడ్ నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణా రావు, పంచాయతీ కార్యదర్శి బి.వెంకటరమణ, విద్యా కమిటీ చైర్మన్ గొర్లె రవికుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మజ్జి వీరనాయుడు, కార్యదర్శి బబ్బాది శివ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
న్యూస్ బై : బి ఎస్ ఎస్ ప్రసాద్







Post a Comment

0 Comments