పాలకొండ వెబ్ న్యూస్: 23 సెప్టెంబర్ 2025 పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నుండి వడమకు వెళ్లే రహదారిలో గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీ కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల నేపథ్యంలో వాహన రద్దీ నియంత్రణలో భాగంగా ఈ వడమ రోడ్ గుండా బస్సులు, వాహనాలు బైపాస్ రోడ్ వలె మల్లింపు చేస్తున్నారు. ఈ కారణంగా రహదారిలో గుంతలు మరింత ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
స్థానికులు మాట్లాడుతూ — భక్తుల రాకపోకలు, వాహనాల సంచారం సజావుగా సాగాలంటే తక్షణమే గుంతలు పూడ్చాలని, లేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని కోరుతున్నారు.
0 Comments