శ్రీ బాలా త్రిపురసుందరీదేవి గా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ

పాలకొండ వెబ్ న్యూస్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు.
పండుగ వేడుకలకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దంపతులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అన్నదానం, భద్రతా ఏర్పాట్లు:
దసరా ఉత్సవాల్లో భాగంగా సుమారు ఐదు వేల మందికి అన్నదానం నిర్వహించారు. అలాగే, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు పర్యవేక్షణలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తించారు.
దగ్గరుండి పర్యవేక్షణ:
పార్వతీపురం మన్యం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.రాజారావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సహా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పల్లా కొండలరావు, పలువురు యువకులు భక్తులకు తాగునీరు అందించడంలో సేవలు అందించారు.
ఈ ఉత్సవాల్లో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, జిల్లా కోర్టు అడిషనల్ జడ్జి నాగమణి, కూటమి నాయకులు నిమ్మక పాండు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments